క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న లాక్‌డౌన్ మే 3వ తేదీ వ‌ర‌కు కంటిన్యూ కానుంది. ఇప్ప‌టికే నెల రోజుల‌కు పైగా ఈ లాక్ డౌన్ కొనసాగుతోన్న నేప‌థ్యంలో వ్య‌వ‌స్థ‌లు అన్ని మంద‌గించ‌డంతో పాటు కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లుతోంది. ఇక మే 3వ తేదీ త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా కూడా కొన్నింటికిపై మాత్రం ఈ నిషేధం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు.

 

విద్యా సంస్థలు, షాపింగ్‌ మాల్స్, ప్రార్థనా స్థలాలు, ప్రజా రవాణా.. తదితర ప్రజలు గుమికూడే ప్రదేశాలపై మే 3 తరువాత కూడా నిషేధం కొనసాగేలా ఉత్త‌ర్వులు జారీ అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు. లాక్ డౌన్ ఎత్తేసినా గ్రీన్‌ జోన్‌ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలను కొంతవరకు అనుమతించవచ్చన్నారు. రైల్వే, విమానయానానికి మాత్రం మే 3 తరువాత కూడా అనుమతి లభించకపోవచ్చన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: