మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని చెప్పారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో కార్మికులు, వలస కూలీల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. 
 
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. హుధ్ హుధ్, తిత్లీ తుఫానులను, వరదలను తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ... టీడీపీ బాధ్యతాయుతమైన పార్టీగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. వైసీపీ సర్కార్ కరోనా కిట్ల కొనుగోలులో సైతం అవినీతికి పాల్పడిందని... ఎంపీ కుటుంబానికి, రాజ్ భవన్ లో కొందరికి వైరస్ సోకడం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమంటూ ఆరోపణలు చేశారు. 
 
చంద్రబాబు ఏపీ ప్రజలకు రాసిన బహిరంగ లేఖపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: