ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు. తల్లుల బ్యాంకు ఖాతాలలో ఫీజు రీయింబర్స్ మెంట్ నగదును జమ చేస్తామని ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను గొప్పగా చదివించాలని తాను ఆశిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. 
 
విద్యార్థుల బోర్డింగ్, లాడ్జింగ్ కు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఎవరైనా తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు కట్టి ఉంటే కాలేజీలు తల్లిదండ్రులకు ఫీజులు వెనక్కు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏవైనా సమస్యలుంటే 1902 నంబర్ కు కాల్ చేయండని చెప్పారు. పేదవారు పెద్ద చదువులు చదివితే వారి బ్రతుకులు బాగుపడతాయని వైయస్సార నమ్మారని చెప్పారు. 
 
మార్చి 31వ తేదీ వరకు పూర్తి బకాయిలను చెల్లించాలమని ప్రకటన చేశారు. గత సంవత్సరం బకాయిలను కూడా చెల్లించినట్టు సీఎం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: