ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. నిమ్మగడ్డ రమేష్ తరపు న్యాయవాదులతో పాటు న్యాయస్థానం ఇతర పిటిషనర్ల వాదనను కూడా వినింది. రేపు కూడా హైకోర్టు కొందరు పిటిషనర్ల వాదనను వినాల్సి ఉండటంతో కోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. గవర్నర్ నుంచి ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత తనకు కావాలనే పదవి నుంచి తొలగించారని ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ నిమ్మగడ్డ రమేష కోర్టు మెట్లెక్కారు. ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసింది. 
 
ఈ పిటిషన్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైకోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: