కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామని అన్నారు. తెలంగాణ రైతులకు 659 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు 918 కోట్లు, మహిళల అకౌంట్లలో 300కోట్లు, పెన్షన్లకు సంబంధించి 46 కోట్లు, భవన నిర్మాణ కార్మికులకు 196 కోట్లు, ఉద్యోగస్తుల కోసం 71 కోట్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించి 550 కోట్లు, కరోనా అసిస్టెన్స్ కోసం 179 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు.
రాజస్థాన్ లో చిక్కుకున్న విద్యార్థుల గురించి మంత్రి కేటీఆర్ తో మాట్లాడానని... ఉత్తరప్రదేశ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్ విద్యార్థులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులను ఏర్పాటు చేసి తీసుకెళ్లాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారని ప్రభుత్వం విద్యార్థులను రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేయడానికి చెప్పారు. ఏపీకి చెందిన గుజరాత్ లోని మత్స్యకారులను పంపించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
54 బస్సుల ద్వారా మత్స్యకారులను సొంతూళ్లకు చేరేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.