గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలకు జగన్ సోదరి షర్మిళ కొంత దూరంగా ఉన్నారు. షర్మిళ ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల గురించి కూడా స్పందించకపోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజా ట్వీట్ తో షర్మిళ తాను రాజకీయాలకు దూరంగా లేనని స్పష్టతనిచ్చారు. తాజా ట్వీట్ లో షర్మిళ జగన్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. జగన్ పరిపాలనలో, పథకాల అమలులో తండ్రి రాజశేఖర రెడ్డిని మించిపోయారని ఆమె చెప్పారు.
సీఎం జగన్ నిన్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా జగన్ చరిత్రలో నిలిచిపోతారని.. ప్రతి పేదవాడికి మేలు చేకూరేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడని ప్రశంసించారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న షర్మిళ తాజాగా జగన్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంపై వైసీపీ కార్యకర్తల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సీఎం జగన్ జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పూర్తి ఫీజును చెల్లించనున్నారు. విద్యార్థుల తల్లి ఖాతాలలో ప్రతి త్రైమాసికంకు ఒకసారి నగదు జమ కానుంది.
'నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. పేదవాడికి మేలు చేయడానికి నేను రెండు అడుగులు ముందుకేస్తా'నని @ysjagan అన్న మాటిచ్చారు.ఆ పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. అన్న ప్రారంభించిన ' #JaganannaVidyaDeevena ' చరిత్రలో నిలిచిపోతుంది#FeesReimbursement #YSJagan pic.twitter.com/q16BixNKic
— YS Sharmila (@ys_sharmila) April 28, 2020