ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేంది. ప్రభుత్వం వ్యవసాయం, హార్డికల్చర్ పనులు, ప్లాంటేషన్, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపులు ఇచ్చింది. గ్రామాల్లో నిర్మాణ పనులు, పవర్ లైన్స్, కేబుల్ లైన్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బుక్ షాపులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. గ్రామాల్లో నిర్మాణ పనులు, కేబుల్ లైన్స్ కు అనుమతులు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని సర్కార్ భావిస్తోంది.
ప్రభుత్వం వలస కార్మికులకు పనులు చేసుకోవడానికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. రెడ్ జోన్లు కాని ప్రాంతాల్లో ఈ సడలింపులు అమలులోకి రానున్నాయి.