ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయం తెలిసిన పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన తరపున, జనసైనికుల తరపున బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు.

 

మార్చి 11వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో భారీ ర్యాలీ చేపట్టాలని భావించినా కరోనా వల్ల ర్యాలీ రద్దయింది. లాక్ డౌన్ తర్వాత బాధ్యతలు చేపట్టాలని అనుకున్న బండి సంజయ్ కొన్ని కారణాల వల్ల ముందుగానే బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.

 

బీజేపీ ముఖ్యనేతలు లక్ష్మణ్‌, ధర్మపురి అర్వింద్‌, మోత్కుపల్లి నరసింహులు మరికొందరు ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ లక్ష్మణ్ స్థానంలో పార్టీ బండి సంజయ్ ను నియమించింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: