సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా రిషీ కపూర్ మృతిపై స్పందించారు. రిషీ కపూర్ మృతి తన మనస్సును చాలా బాధ పెట్టిందని చెప్పారు. రిషీ కపూర్ మరణం సినీ పరిశ్రమకు కోలుకోలేని నష్టం అని అన్నారు. రిషీ కపూర్ నిజమైన లెజెండ్ అని చెప్పారు. రణబీర్ మరియు అతని కుటుంబ సభ్యులకు మహేష్ బాబు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రిషీ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
 
ఈరోజు ఉదయం ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 5.20 గంటలకు రిషీ కపూర్ కన్నూమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. రెండు రోజుల క్రితం సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. 2018లో క్యాన్సర్ భారీన పడిన రిషీ కపూర్ అమెరికాలో చికిత్స చేయించుకుని ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, మహేష్ బాబు, ఇతర టాలీవుడ్ హీరోలు సోషల్ మీడియా ద్వారా రిషీ కపూర్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: