తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో ప్రైవేట్ రవాణా, కార్గో సర్వీసుల యజమానులకు ఉరట కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి మూడు నెలల మోటార్ వాహన పన్ను చెల్లించని వారికి వెసులుబాటు కల్పిస్తూ మరో నెల రోజుల పాటు గడువు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్రంలో దాదాపు 4 లక్షల వాహనాలు ఉండగా ప్రభుత్వ నిర్ణయం వల్ల వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. వాణిజ్య వాహనాల యజమానులు ఏప్రిల్ 30వ తేదీ లోపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా ఆ గడువును నెల రోజుల పాటు పెంచుతున్నట్టు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ లారీ యజమానుల సంఘం, క్యాబ్స్ యజమానుల అసోసియేషన్లు వాహన పన్ను చెల్లింపును వాయిదా వేయాలని కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం నెలరోజుల పాటు గడువును పొడిగించటంపై వాణిజ్య వాహనాల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.