ఈ మధ్య కాలంలో హత్యలకు సంబంధించిన ఘటనలు పెరిగిపోతున్నాయి. మెజారిటీ కేసుల్లో రక్త సంబంధీకులే హత్యలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన ఇంట్లోని ఆరుగురు కుటుంబ సభ్యులను హత్య చేసి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

 

యువకుడు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆరుగురిని హత్య చేసినట్లు చెప్పడంతో పోలీసులు షాక్ కు గురయ్యారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయగా ఆ వ్యక్తి నిజమే చెప్పాడని తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

 

నిందితుడు కుటుంబ సభ్యులను హత్య చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ల‌క్నో పోలీస్ క‌మిష‌న‌ర్ సుజిత్ పాండే మాట్లాడుతూ విచారణ అనంతరం పూర్తి విషయాలను వెల్లడిస్తామని ప్రకటన చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: