కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే భారీ స్థాయిలో సడలింపులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సడలింపుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా కేంద్రం మద్యం దుకాణాలు ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. 
 
రాష్ట్రంలోని రెడ్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు అమలు కానున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం సడలింపులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్రం గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలకు, పాన్ షాపులకు అనుమతి ఇచ్చింది. ఆరెంజ్, రెడ్ జోన్లలో మాత్రం మద్యం దుకాణాలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. కేంద్రం గ్రీన్ జోన్లలో పరిమిత సంఖ్యలో బస్సులు నడపవచ్చని పేర్కొంది. 
 
గ్రీన్ జోన్లలో వ్యక్తిగత ప్రయాణాలకు ఆంక్షలు ఉండవని తెలిపింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: