కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కొరకు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. రైల్వే శాఖ ఈ రైళ్లకు టికెట్ ధర విషయంలో కసరత్తు చేస్తోంది. ప్రయాణికులు రైళ్లలో సామాజిక దూరం పాటించాలని కేంద్రం నిబంధనలు జారీ చేసింది. రైల్వే శాఖ ప్రయాణికులకు శానిటైజర్లు, మాస్కులు, ఆహారం అందించనుంది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు తరలించాలని వినతులు రావడంతో కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. 
 
రోజుకు 400 రైళ్లు నడిపేందుకు కేంద్రం సిద్ధమైంది. రెండు రోజుల క్రితం కేంద్రం ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రమే రైళ్లు నడపాలని కోరడంతో కేంద్ర మంత్రులు ప్రధాని మోదీతో చర్చలు జరిపి ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు పంపేలా కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులు, పర్యాటకులు నోడల్ ఆఫీసర్ ను సంప్రదించాలని సమాచారం. 
 
కేంద్రం ప్రత్యేక రైళ్లను నడపాలని తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: