హైదరాబాద్ లోని రామాంతపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే అనుమానంతో ఒక వ్యక్తి భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా భయంతో మానసిక ఆందోళనకు గురై ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలలోకి వెళితే రామాంతపూర్ లోని వీఎస్ అపార్టుమెంట్ లోని ఫ్లాటు నంబర్ 303 లో నివశించే వాసిరాజు కృష్ణమూర్తి గత కొంతకాలంగా గ్యాస్ సమస్యలతో బాధ పడుతున్నారు. 
 
తరచూ ఆయాసం వస్తూ ఉండడంతో కరోనా సోకిందని మానసిక ఆందోళనకు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లగా కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఈరొజు కృష్ణమూర్తిని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ అంతలోపే ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకి కృష్ణమూర్తి ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: