కర్నూలు జిల్లాలో కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. శ్వాస సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి లక్ష్మీదేవి అనే మహిళ ఆస్పత్రిలో చేరింది. మహిళ రెడ్ జోన్ ప్రాంతం నుంచి రావడంతో వైద్యులు చికిత్సకు నిరాకరించారు. మహిళను తీసుకుని ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆమె మృతి చెందింది. 
 
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మహిళ మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రి ముందు మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు మహిళను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స చేయించాలని కోరినా వైద్యులు అందుకు అంగీకరించలేదని సమాచారం. రెడ్ జోన్లలో ప్రజలు సరైన సమయంలో చికిత్స అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: