ఏపిలో కరోనా ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులపై సమీక్షా నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికోసం అనుసరించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సొంత ప్రదేశాలకు వచ్చేవారిని జాగ్రత్తగా చూడాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని, అందులో 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి ఏర్పాట్లు చేసుకోవాలని, భోజన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
విదేశాల్లో ఉన్నవారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో గడ్డు పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎప్పుటిప్పుడు పరిస్థితులపై సమగ్ర సమాచారం అందించాలని అన్నారు.