
తెలుగు చిత్రసీమకు మంచి మంచి సినిమాలను అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన సినీ పరిశ్రమలో 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. సూపర్ సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అయ్యి సూపర్ గర్ల్ అనిపించుకున్న స్వీటీ అనుష్క ఈ సందర్భంగా దర్శకేంద్రుడికి తన అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు తన ఫాన్స్ ఆమె ఫ్యాన్స్ ఖాతా నుండి ఆయనకు విషెష్ తెలియజేశారు.
స్వీటీ అనుష్క శెట్టి దర్శక నిర్మాత రాఘవేంద్ర రావు చేసిన సినిమా లో జ్యోతి గా నటించింది. అయితే ఆమె చేసిన ఆ క్యారెక్టర్ సినీ అభిమానుల మనసు దోచింది. డైరెక్టర్ రాఘవేంద్ర రావు తన సినీ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నారు. ముఖ్యంగా అయన తన సినిమాలో హీరొయిన్ ను చూపించే విధానం అభిమానులకే కాదు సినీ తరాలకు నచ్చుతుంది. అందుకే కాబోలు ప్రతి హీరొయిన్ తమ కెరీర్ లో ఒక్కసారన్నా రాఘవేంద్రరావు సినిమాలో కనిపించాలని ఆశ పాడుతారు. 45 వసంతాలు టాలీవుడ్ లో పూర్తి చేసుకున్న దర్శకేంద్రుడికి ఇండియన్ హెరాల్డ్ గ్రూప్స్ తరపున శుభాభివందనాలు ...
Congratulations and best wishes from all #AnushkaShetty fans to our Darshakendrulu, legendary director @Ragavendraraoba garu on completing 45 Glorious years in films! 🙏❤️ #45YearsOfKRR #KRR #RaghavendraRaoBA pic.twitter.com/NkNWHussHN
— anushka shetty Fanclub™ (@sweetyanushkafc) May 3, 2020