దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో జమ్మూకశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్ జరిగింది. కల్నల్, మేజర్‌ స్థాయి అధికారి, ఇద్దరు జవాన్లు ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
మహేష్ తన ట్వీట్లో హంద్వారా దాడి మన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. దేశాన్ని కాపాడటం కోసం సైనికులకు ఉన్న సంకల్పం, ధైర్యం ఎంతో ధృడమైనవి అని పేర్కొన్నారు. పౌరుల ప్రాణాలను కాపాడి విధి నిర్వహణలో కన్నుమూసిన వీర సైనికులకు మౌనం పాటించి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. 
 
భగవంతుడు వారి కుటుంబాలకు బలం, ధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సినిమాలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: