తెలంగాణ రాష్ట్ర కేబినెట్ రేపు భేటీ కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ సడలింపులపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రధానంగా ఈ నెల 21 వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ఈ నెల 17 వరకు పొడిగించింది. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు అంశాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది. తెలంగాణ సర్కార్ రెడ్ జోన్లలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను యథాతథంగా అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిబంధనలు సడలిస్తే పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
మద్యం దుకాణాల విషయం గురించి కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.