ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా తాజాగా బ్రిటన్ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నాడు. తొలుత విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలంటూ వెస్ట్‌మినిస్టర్ మెజిస్ర్టేట్ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ విజయ్ మాల్యా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు మాల్యాకు ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. దీంతో చివరి ప్రయత్నంలో భాగంగా విజయ్ మాల్యా సూప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
విజయ్ మాల్యా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్ కు పారిపోయారు. ఆయనపై మనీ లాండరింగ్, ఆర్థిక మోసం, ఇతర కేసులు నమోదయ్యాయి. ఈడీ, సీబీఐ విజయ్ మాల్యాను భారత్ కు తిరిగి రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయలు విజయ్ మాల్యా రుణం తీసుకున్నారు. మే 14వ తేదీ వరకు మాల్యాకు అప్పీల్ చేసుకోవడానికి సమయం ఉంది.