దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. మీట్ నగర్ లోని ఇంటి దగ్గర కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. సీలంపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలైన వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న ఒక వ్యక్తి సదరు కానిస్టేబుల్ సోదరుడిపై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ దాడి చేసిన వ్యక్తులపై కాల్పులు జరిపాడు.
గాయాలపాలైన వ్యక్తులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కాల్పులు జరిపిన కానిస్టేబుల్ తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది.