దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిసున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీలో కర్నూలు జిల్లాపై కరోనా పంజా విసురుతోంది. జిల్లాలో ఈరోజు మరో 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 516కు చేరింది. జిల్లాలో ఇప్పటివరకు 10 మంది కరోనా భారీన పడి మృతి చెందారు.
జిల్లాలో 114 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 392 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలో కరోనా విజృంభణ గురించి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు నగరంలో రోజుకో కొత్త రూపంలో కరోనా వైరస్ ప్రతాపం చూపుతోందని అన్నారు. జిల్లాలో కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. మన కర్నూలు మన బాధ్యత అంటూ ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. మరోవైపు జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
రోజుకో కొత్త రూపంలో కరోనా కర్నూలు నగరంలో తన ప్రతాపం చూపుతోంది.
— Byreddy siddhartha Reddy (@siddharthaysrcp) May 5, 2020
కర్నూలు నగరంలో కరోనా కట్టడికి ప్రజల సహకారం ఎంతో అవసరం.
"మన కర్నూలు - మన బాధ్యత"#APFightsCorona #YSJaganCares