ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యపానాన్ని నిరూత్సాహపరిచేందుకు 75 శాతం రేట్లు పెంచామని అన్నారు. 25 శాతం ధరలు పెంచి మద్యం వినియోగం తగ్గించాలని భావించామని.... కానీ ఢిల్లీ 70 శాతం రేట్లు పెంచడంతో రాష్ట్రంలో 75 శాతం మద్యం రేట్లను పెంచామని ప్రకటించారు. అందుకే 75 శాతం ధరలు పెంచి గట్టి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈరోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జులై 8న అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందజేయాలని సూచించారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి విజ్ఞప్తులు వచ్చాయని.... మరోసారి అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే వివరాలు సేకరించి... గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలన్నారు. ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే ఇళ్ల పట్టా ఇవ్వాలని... అర్హత ఉన్నవారు ఎవ్వరూ ఇంటి పట్టా లేదని చెప్పకూడదని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: