సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతాయని అన్నారు. హైదరాబాద్ ప్రజలు తిట్టుకున్నా తనకు గత్యంతరం లేదని... మరికొన్ని రోజుల పాటు నగరంలో ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రసక్తి లేదని అన్నారు. హైదరాబాద్ తో పాటు మిగతా రెడ్ జోన్లలో కూడా ఇవే నిబంధనలు అమలవుతాయని పేర్కొన్నారు.
ఈ నెల 15వ తేదీన రివ్యూ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని అన్నారు. గ్రామాలు, మండలాల్లో షాపులు తెరచుకోవడానికి అనుమతులు ఇస్తున్నామని అన్నారు. మున్సిపాలిటీలలో మాత్రం 50 శాతం షాపులకు అనుమతులకు ఇస్తున్నామని చెప్పారు. వైద్యుల సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరచుకుంటాయని తెలిపారు.
రేపటి నుంచి ఇసుక మైనింగ్ ప్రారంభమవుతుందని అన్నారు. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో అన్ని షాపులు నడుస్తాయని అన్నారు.