తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. రేపటి నుంచి రాష్ట్రంలో జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభవుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దని సీఎం సూచించారు. పదో తరగతి పరీక్షలు ఈ నెలలోనే నిర్వహిస్తామనిఅన్నారు. హైకోర్టు నిబంధనల మేరకు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 
 
కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు జరిగేలా చర్యలు చేపడతామని అన్నారు. విద్యార్థుల కోసం బస్సులు, ధనవంతుల కార్లకు పాసులు మంజూరు చేస్తామని అన్నారు. కరోనాతో కలిసి బ్రతకాల్సిందే అని సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నెలలోపు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెడ్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో కేంద్రం నిర్ణయాల మేరకు లాక్ డౌన్ సడలింపులు ఇస్తామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: