విశాఖలో గ్యాస్ లీక్ ఘటనతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏపీ సీఎం జగన్ ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఈరోజు మధ్యాహ్నం విశాఖకు వెళ్లనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించారు. వెంకటాపురంలో పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజ్ అయిన ఘటన దురదృష్టకరమని అన్నారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
యుద్ధప్రాతిపదికన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని సూచించారు. మూగజీవాలను కాపాడాలని... చెట్ల రంగు మారడం విషవాయువు తీవ్రతకు నిదర్శనమని చెప్పారు. ఈరోజు ఉదయం మూడు గంటల సమయంలో ఫ్యాక్టరీ నుంచి విషవాయువు విడుదలైంది. ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనలో వందలాది మంది అస్వస్థతకు గురి కాగా బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స జరుగుతోంది.