ఈరోజు ఉదయం విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 340 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ సంఘటన దురదృష్టకరమని సీఎం అన్నారు. ఈ సంఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ నివేదిక ఇస్తుందని అన్నారు. 
 
బాధితుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు సమర్థవంతంగా పని చేశారని అన్నారు. కలెక్టర్, ఎస్పీ ఉదయం 4 గంటల నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నారని చెప్పారు. బొత్స సత్యనారాయణ అన్న, కృష్ణబాబు అన్న, అవంతి శ్రీనివాస్ బాధితులకు అందుబాటులో ఉంటారని... ఐదు గ్రామాల ప్రజలకు, బాధితులకు ఏ సమస్య వచ్చినా వారిని సంప్రదించాలని సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: