దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. తాజాగా కరోనా సోకిన గర్భిణికి వైద్యులు గాంధీ ఆస్పత్రిలో డెలివరీ చేశారు. మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని డెలివరీ చేశారని సమాచారం.
గర్భిణి కుటుంబంలోని అందరూ కరోనా భారీన పడ్డారని... బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న వైద్యులు గర్భిణీని ఎలాగైనా కాపాడాలని డాక్టర్లు దాదాపు రెండు గంటలు శ్రమించారని సమాచారం. డెలివరీ చేసిన వైద్యురాలు అనిత మాట్లాడుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ప్రణాళిక ప్రకారం సిజేరియన్ చేశామని.... ప్రత్యేక వైద్య బృందం ఎంతో కష్టపడి తల్లీబిడ్డను రక్షించిందని చెబుతున్నారు. పుట్టిన బిడ్డను పరిశీలనలో ఉంచామని వైద్యురాలు చెబుతున్నారు.