దేశంలో కరోనా మహమ్మారి వల్ల ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల బస్సులు, రైళ్లు, విమాన ప్రయాణాలపై కేంద్రం ఆంక్షలు విధించింది. అయితే గత కొన్ని రోజులుగా ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రం తాజాగా రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రైల్వే శాఖ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది.
మే 12 నుంకి రైళ్లు నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే శాఖ ప్రస్తుతం 15 రైళ్లను నడపనున్నట్టు సమాచారం. రైల్వే శాఖ ఢిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపనుంది. ఢిల్లీ నుంచి అగర్తల, దిబ్రుగఢ్, హౌడా, పాట్నా, రాంచీ, బిలాస్ పూర్, భువనేశ్వర్, సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, త్రివేండం, మద్ గామ్, ముంబాయి, అహ్మదాబాద్, జమ్మూతావి ప్రాంతాలకు రైళ్లు నడపనుంది. రేపటి నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభం కానుంది.