ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమైంది. ప్రధాని మోదీ సీఎంలతో ప్రధానంగా లాక్ డౌన్, కరోనా నియంత్రణ చర్యల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ వలస కార్మికుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులు తిరిగి వస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయని సీఎంలు మోదీకి తెలిపారు. 
 
వలస కార్మికుల గురించి మోదీ స్పందిస్తూ ఇంటికి వెళ్లాలనుకోవడం మానవుని సహజ లక్షణం అని... వారు సురక్షితంగా ఇంటికి చేరేలా చూడాలని సూచించారు. ఏ ప్రాంతం అయినా భౌతిక దూరం తప్పనిసరి అని మోదీ చెప్పారు. రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని మోదీ సూచించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల గురించి పలు రాష్ట్రాల సీఎంలు అభ్యంతరం తెలిపారు. మూడో విడత లాక్ డౌన్ తర్వాత భారీ సడలింపులు ఇవ్వనున్నట్టు మోదీ సీఎంలతో చెప్పారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: