ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ యావత్ ప్రపంచానికి భారత్ మార్గనిర్దేశం చేస్తోందని చెప్పారు. ఇలాంటి సంక్షోభం కనివీనీ ఎరుగమని... ఈ సంక్షోభం మనకు ఒక అవకాశం కావాలని చెప్పారు. ఇప్పుడు ప్రతి రోజూ 2 లక్షల పీపీఈ కిట్లను, ఎన్ 95 మాస్కులను భారత్ ఉత్పత్తి చేసిందని అన్నారు. సప్లై చైన్ ను మరింత పటిష్టం చేయాలని మోదీ సూచించారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ప్రపంచం యుద్ధం చేస్తోందని తెలిపారు.
ఈ వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. 21వ శతాబ్దం భారత్ దే అని అని చెప్పారు. ప్రస్తుతం చాలా కీలకమైన దశలో ఉన్నామని తెలిపారు. భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం నమ్ముతోందని తెలిపారు. భారత్ స్వయం సమృద్ధి ఐదు స్తంభాలపై నిలబడిందని వ్యాఖ్యలు చేశారు.