ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కరోనాను కట్టడి చేయడంలో భారత్ సత్తా ఎంతో ప్రపంచం చూస్తోందని అన్నారు. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. దేశ జీడీపీలో మొత్తం 10 శాతం ప్యాకేజీగా ప్రకటించామని తెలిపారు. ఈ ప్యాకేజీతో భార‌త్ బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ క‌ల దేశంగా మారుతుందని అన్నారు. చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊత‌మిచ్చేందుకు ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు. 
 
ఈ ప్యాకేజ్ వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి ప్రకటిస్తారని చెప్పారు. సంఘటిత, అసంఘటిత కార్మికులందరినీ ప్యాకేజీతో ఆదుకుంటామని చెప్పారు. కొత్త నిబంధనలతో 4వ దశ లాక్ డౌన్ ఉంటుందని అన్నారు. మే 18వ తరువాత నాలుగో దశ లాక్ డౌన్ గురించి తెలుస్తుందని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: