అగ్రరాజ్యం అమెరికా కరోనా విజృంభణతో గజగజా వణుకుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో వ్యాధి ప్రబలుతూ ఉండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. టాక్సి షాక్ సిండ్రోమ్‌గా పిలిచే ఈ వ్యాధి భారీన పడి ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. న్యూయార్క్ లో వంద మంది పిల్లలు ఈ వ్యాధి భారీన పడినట్టు తెలుస్తోంది. 
 
కొందరు పిల్లల్లో కరోనా సోకిన ఆరు వారు వారాల తర్వాత ఈ వ్యాధి బయటపడుతూ ఉండటం గమనార్హం. టాక్సి షాక్ సిండ్రోమ్‌ సోకిన పిల్లల్లో పిల్ల‌ల్లో జ్వ‌రం, నీర‌సం, ఆక‌లి వేయ‌క‌పోవ‌డం, వికారం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. 5 సంత్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సున్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి భారీన పడుతున్నారు. 15 నుంచి 19 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌వారిలో 16 శాతం కేసులు సంభవిస్తున్నట్టు తెలిపారు. చిన్న‌పిల్ల‌లు ఉన్న తల్లిదండ్రులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: