దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 472 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 8470కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడచిన 24 గంటల్లో 187 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3045కు చేరింది. 
 
ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతున్నా మృతుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఢిల్లీలో ఇప్పటివరకు 115 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. ఢిల్లీలో ప్రస్తుతం 5310 కేసులు యాక్టివ్ కేసులుగా ఉన్నాయి. మృతుల్లో 60 సంవత్సరాలకు పై బడిన వారు 59 మంది ఉన్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: