కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగష్టు నెల వరకు వన్ నేషన్ వన్ రేషన్ అమలులో ఉంటుందని అన్నారు. రేషన్ కార్డు లేని వారికి పది కేజీల బియ్యం, కేజీ శనగలు పంపిణీ చేస్తామని అన్నారు. ఇకపై దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పిస్తున్నారు, వచ్చే రెండు నెలలు వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ అన్నారు. 8 కోట్ల మంది కార్మికులకు ఉచిత రేషన్ అందుతుందని చెప్పారు.
వచ్చే రెండు నెలలు వలస కార్మికులకు రేషన్ అందేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. దేశమంతటా ఒకటే కనీస వేతనం ఉండేలా చూస్తామని చెప్పారు. 10 మందికి పైగా ఉపాధి కల్పించే కంపెనీలకు ఈ.ఎస్.ఐ సౌకర్యం కల్పిస్తామని అన్నారు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపడతామని అన్నారు,