చాలా కాలం తరువాత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వార్తల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితం ఆస్తుల వేలంతో వార్తల్లో నిలిచిన గంటా తాజాగా కరోనా కట్టడి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పర్యటించారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలోని ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు, మాస్కులను పంపిణీ చేశారు. గంటా సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
2020 సంవత్సరం మార్చి నెలలో ఇండియన్ బ్యాంక్ గంటా శ్రీనివాసరావు తీసుకున్న రుణానికి సంబంధించి వడ్డీ కూడా కట్టలేదని వేలం వేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన అనంతరం కొంతకాలం సైలెంట్ అయిన గంటా తాజాగా పేదలకు సహాయసహకారాలు అందించి గొప్ప మనస్సు చాటుకున్నారు. మరోవైపు విశాఖ జిల్లాలో ఇప్పటివరకూ 66 కేసులు నమోదు కాగా 25 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఒకరు కరోనా భారీన పడి మృతి చెందగా ప్రస్తుతం 40 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 55వ వార్డు కంచరపాలెం లో నిత్యావసర సరుకులు, కూరగాయలు మరియు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. pic.twitter.com/FzP719n0wh
— ganta srinivasa rao (@Ganta_Srinivasa) May 14, 2020