ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న చర్యలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. విజయశాంతి తన ఫేస్ బుక్ లో గ్రేటర్ హైదారాబాద్ పరిధిలో కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో అంతుచిక్కటం లేదని అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ గతంలో మే నెల 8వ తేదీ తర్వాత కరోనా కేసులు తగ్గుతాయని ప్రకటన చేసిందని... నగరంలో కేసులు తగ్గకపోగా కరోనా విజృంభిస్తోందని పేర్కొన్నారు. 
 
 
ప్రభుత్వం కరోనా వైరస్ విజృంభించకుండా హైదరాబాద్ ను రెడ్ జోన్ గా ప్రకటించిందని... హైదరాబాద్ మహానగరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లే అవకాశం లేకపోయినా కేసుల సంఖ్య పెరగడానికి కారణాలు అంతుచిక్కటం లేదని చెప్పారు. తెలంగాణ ప్రజలు గత నాలుగు రోజులుగా కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారని... టీఆర్ఎస్ సర్కార్ వివరణ ఇవ్వాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: