భారతదేశానికి ప్రపంచ బ్యాంక్ శుభవార్త చెప్పింది. భారత్ కు వరల్డ్ బ్యాంక్ సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద వంద కోట్ల డాలర్లు ప్రకటించింది. ప్రపంచ బ్యాంక్ ఈ ప్యాకేజీ భారత్ ప్రకటిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు లింకై ఉంటుందని పేర్కొంది. వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద పలు దేశాలకు నిధులు సమకూరుస్తోంది. వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ మాట్లాడుతూ నగదు లావాదేవీల విధానం చాలా కీలకమైందని దీని వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు.
ప్రపంచ బ్యాంక్ భారత్ తో మూడు రంగాల్లో భాగస్వామ్యం చేసుకోనుందని ఆయన అన్నారు. సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ నిధులను ఆరోగ్యం, సామాజిక సంరక్షణ, చిన్నమధ్యతరహా పరిశ్రమల కోసం ఖర్చు చేయనున్నామని చెప్పారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 82,000కు చేరింది.