ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ తొలి విడత 7,500 రూపాయలు సాయం అందిస్తున్నామని చెప్పారు. తొలి విడతలో 2,000 రూపాయలు కరోనా విజృంభణతో గత నెలలో జమ చేశామని... ఈరోజు 5,500 రైతుల ఖాతాలలో జమవుతుందని అన్నారు. రైతుల ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తామని... 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు.
రైతులకు మేలు చేయాలన్నదే వైసీపీ లక్ష్యం అని... పార్టీలకు అతీతంగా సహాయం చేస్తామని అన్నారు. వైసీపీకి ఓటేయని రైతులకు కూడా రైతు భరోసా సాయం అందజేస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతులకు అక్టోబర్ నెలలో 4,000 రూపాయలు, జనవరి నెలలో 2,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం అన్నారు.