కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ ఆధారిత అంకుర సంస్థలు, రైతుల ఉత్పత్తి సంఘాలకు ఈ నిధుల వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఆహార రంగంలోని సూక్ష్మ పరిశ్రమలకు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని అన్నారు. 
 
ప్రధాని చెప్పిన వోకల్ ఫర్ లోకల్ కలను సాకారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయ విపణులకు స్థానిక ఉత్పత్తులను చేర్చేందుకు ఈ నిధితో సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల సూక్ష్మ సంస్థలకు ప్రయోజనం కలిగేలా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: