తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ 2016 - 2017 నుండి ఒకే నిష్పత్తిలో పంపకాలు జరుగుతున్నాయని అందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అంగీకరించాని అన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఏపీ జీవో ఇచ్చిందని అన్నారు. పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని అన్నారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సరైన పద్ధతిలో నీటిని వినియోగించాలని సూచించారు.
సీఎం జగన్, కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని అన్నారు. కేసీఆర్ టెలీ మెడిసిన్ స్టేషన్ల కోసం నిధులు కేటాయించలేదని... కేసీఆర్ ఎందుకు నిధులు కేటాయించడం లేదో అర్థం కావడం లేదని అన్నారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 203 జీవో కారణంగా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నష్టం వాటిల్లుతోందని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 203 ను రద్దు చేసేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.