ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రెండు రోజుల క్రితం పదో తరగతి పరీక్షా కేంద్రాలను ప్రకటించిన జగన్ సర్కార్ తాజాగా పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పదో తరగతి పరీక్షల్లో నూతన విధానాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థులకు నివాస ప్రాంతాలకు దగ్గరలోనే పరీక్ష కేంద్రాలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
చాలా మంది విద్యార్థులు లాక్ డౌన్ అమలులో ఉండటంతో సొంతూళ్లకు వెళ్లిపోయారు. అందువల్ల చదివిన పాఠశాల ప్రకారం పరీక్ష కేంద్రాలను ప్రకటిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ విద్యార్థులు నివాసానికి దగ్గరగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.