సుప్రీం కోర్టు ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని మరోమారు స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, పల్లా శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, టీడీపీ ముఖ్య నేతలు ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని... జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు దక్కలేదని పిటిషన్ల్ దాఖలు చేశారు.
ఈరోజు అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించి గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పు చెప్పింది. గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థిస్తూ తీర్పు చెప్పింది.