ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 68 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2407కు చేరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీకి పలు సంస్థలు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నాయి. తాజాగా ఏపి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్, ఏపి క్రెడాయ్ రూ. 1,00,00,000/ విరాళం అందజేసింది. 
 
విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపి ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఎం. మురళి, అక్కయ్య నాయుడు, ప్రకాష్, సుధాకర్, రాంబాబు సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ కు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సీఎం జగన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 1639 మంది డిశ్చార్జ్ కాగా 715 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 53 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: