కర్ణాటక రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు 105 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1710కు చేరింది. 1080 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో 17 మందిని డిశ్చార్జి అయినట్టు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 41గా ఉంది. మొదట్లో కరోనా కేసులు తక్కువగా నమోదైన కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. కంటన్మెంట్ జోన్లలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది.