జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు గత కొన్ని రోజులుగా వరుస ట్వీట్లతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు తాజాగా మరో వివాదాస్పద ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితం నాగబాబు మహాత్మ గాంధీజీని హత్యచేసిన నాథూరాం గాడ్సే నిజమైన దేశభక్తుడు అంటూ వివాదస్పద ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా భారత కరెన్సీ నోట్లపై సుభాష్‌ చంద్రబోస్‌, అంబేద్కర్‌, భగత్‌ సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, లాల్‌ బహదూర్‌, పీవీ నరసింహారావు, అబ్దుల్‌ కలాం, సావర్కార్‌, వాజ్‌పేయి లాంటి మహానుభావుల చిత్రాలను చూడాలని ఉందని ట్వీట్ చేశారు. 
 
స్వతంత్ర భారత ఆవిర్బావానికి కృషి చేసి మహానుభావులను జనం మర్చిపోకూడదని ఒక ఆశ అని ఆయన అన్నారు. గాంధీ గారు బతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసి దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారని ట్వీట్ చేశారు. భావితరాలకు కరెన్సీ నోట్లపై వారి ముఖ పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం నాగబాబు చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: