దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కర్ణాటక సీఎం యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవారిని క్వారంటైన్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న ఆరోగ్య శాఖ నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 
 
వైరస్‌ నెగటివ్‌ వచ్చిన వారికి కూడా హోం క్వారంటైన్‌ విధించనున్నట్టు కర్ణాటక సర్కార్ నుంచి ప్రకటన వెలువడింది. తక్కువ వైరస్‌ వ్యాప్తి ఉన్న రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారు విధిగా 14 రోజుల పాటు హోం కార్వంటైన్‌ను పాటించాలని ప్రభుత్వం కోరింది. గర్భిణి స్త్రీలు, పదేళ్ల లోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు హోం క్వారంటైన్‌కు‌ పరిమితం కావాలని.... బిజినెస్‌ కార్యకలాపాల కోసం రాష్ట్రానికి వచ్చేవారు కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకొని నెగటివ్‌ అని తేలిన రాష్ట్రానికి రావాలని ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: