మాయదారి కరోనా మహమ్మారి ఎప్పుడు దేశంలో చొరబడిందో కానీ ఎవ్వరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  పుట్టిన చిన్నారి నుంచి ముదుసలి వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇక గర్భిణులకు కరోనా వస్తే.. పుట్టిన సంతానానికి కొన్ని చోట్ల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే క్రమంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన ఓ గర్భిణికి కూడా ఇటీవల కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి ఆమెను ఇండోర్‌లోని MTH ఆస్పత్రిలో ఐసోలేషన్‌కు తరలించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నఆమె శనివారం మధ్యాహ్నం పండంటి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవించిన మహిళతోపాటు పిల్లలిద్దరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఎంటీహెచ్‌ ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్‌ సుమిత్‌ సుక్లా చెప్పారు.

 

ఆమెను నార్మల్‌ డెలివరీ ద్వారానే పిల్లలిద్దరూ జన్మించారని ఆయన తెలిపారు. అయితే పిల్లలకు మాత్రం కరోనా సోకలేదని డాక్టర్లు అంటున్నారు.  కరోనా ని కట్టడి చేయడం మన చేతుల్లో పని అని.. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ.. కరోనాని కట్టడి చేయవొచ్చని డాక్టర్లు అంటున్నారు.  దేశంలో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 137 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: