హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతుంటాయని నగరవాసులు జలమండలిపై విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి కొందరు వ్యాపారస్తులు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఘన వ్యర్థాలను మురుగు కాల్వల్లో పడేయడం వల్ల భరించలేని వాసనతో మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతుంటాయి. హోటల్స్ ,లాడ్జి, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు, ఫంక్షన్‌హాల్స్, సినిమాహాళ్లు, దవాఖానలు, పరిశ్రమలు, డెయిరీ ఫాంలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నా చాలా సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటారు.
డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్య తరుచూ ఉత్పన్నమవుతూ పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తూ ఉంటారు. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జలమండలి వాణిజ్య సంస్థలు స్టిల్ చాంబర్లు (వ్యర్థాలు పైపులైన్లలోకి వెళ్లకుండా ఆపే జాలీలు) ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. దీంతో జలమండలి ఇచ్చిన గడువులోగా సిల్ట్ చాంబర్లను ఆయా వాణిజ్య సంస్థలు నిర్మింకుకోవాలని... లేదంటే ఒక్కో సంస్థపై రూ. వెయ్యి చొప్పున, ఆపైన రోజుకు రూ. వంద వరకు జరిమానా విధిస్తామని నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు