ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఒక ప్రకటనలో సిక్కింను మరో దేశంగా చూపించింది. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఈ పత్రికా ప్రకటన దుమారం రేపింది. ఈ యాడ్ లో నేపాల్, భూటాన్ దేశాల సరసన ఢిల్లీని చేర్చారు. సిక్కింను మరో దేశంగా చూపించడంపై సిక్కిం సీఎం ప్రేమ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం ఆ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. 
 
ఇండియాలో సిక్కిం రాష్ట్రం అంతర్భాగమని, మేం భారతీయులమని గర్వంగా చెప్పుకుంటామంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. వారం రోజుల క్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకున్నామని... ఇలాంటి ప్రకటనలు సిక్కిం ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తాయని చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకుంటామని... పొరపాటు వల్ల అలా జరిగిందని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: